తెలంగాణ

telangana

ETV Bharat / state

చోరీ జరిగిన గంటన్నరలోపే కేసును ఛేదించిన పోలీసులు - kamareddy latest crime news'

కామారెడ్డి జిల్లా బిచ్కుందలో దొంగతనం జరిగిన గంటన్నరలోపే కేసును ఛేదించిన సీఐ సాజిద్ తుల్ల, ఎస్సై సాయన్నలను డీఎస్పీ దామోదర్ రెడ్డి అభినందించారు.

kamareddy dsp appriciate bichkundha police
చోరీ జరిగిన గంటన్నరలోపే కేసును ఛేదించిన పోలీసులు

By

Published : Jul 19, 2020, 2:05 PM IST

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కేంద్రానికి చెందిన పోచవ్వ అనే వృద్ధురాలు నాగుల పంచమి సందర్భంగా కొత్త బట్టలు కొనేందుకు బాన్సువాడకు వెళ్లింది. బట్టల దుకాణానికి వెళ్తుండగా మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నీకు ఆసరా పింఛన్ ఇప్పిస్తా.. బ్యాంకుకు రమ్మంటూ తీసుకెళ్లాడు. మధ్యలోనే ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకొని పరారయ్యాడు. గొలుసు లాగుతున్న క్రమంలో వృద్ధురాలి మెడకు గాయమైంది. స్థానికుల సాయంతో పోచవ్వ పోలీస్ స్టేషన్​​లో ఫిర్యాదు చేసింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు జుక్కల్ మండలం పెద్ద ఏడిగి గ్రామానికి చెందిన దిగంబర్​గా గుర్తించారు. దొంగతనం జరిగిన గంటన్నరలోపే కేసును ఛేదించిన బిచ్కుంద సీఐ సాజిద్ తుల్ల, ఎస్సై సాయన్నలను డీఎస్పీ దామోదర్ రెడ్డి అభినందించారు.

ఇవీ చూడండి:'ఒక్కసారి మా నాన్నను చూడనివ్వండి.. ప్లీజ్'

ABOUT THE AUTHOR

...view details