కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదయ్యాయి. 49 వార్డులున్న కామారెడ్డిలో తెరాస 23 వార్డుల్లో జయకేతనం ఎగురవేసింది. 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా... భాజపా 8 చోట్ల గెలిచింది. ఎంఐఎం 00, ఇతరులు 06 చోట్ల గెలిచారు. కామారెడ్డిలో ఛైర్మన్ పీఠాన్ని తెరాస పార్టీ కైవసం చేసుకుంది.
బస్తీమే సవాల్: కామారెడ్డి జిల్లాలో కారు జోరు - కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయం
కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పురపాలికలను తెరాస కైవసం చేసుకుంది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కారుజోరు ప్రదర్శించింది.
బాన్సువాడ 19 వార్డులకు ఫలితాలు వెలువడ్డాయి. తెరాస పార్టీ 17 వార్డులు కైవసం చేసుకోగా... మిగిలిన రెండు స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. భాజపా, ఎంఐఎం, ఇతరులు ఒక్కస్థానం కూడా దక్కించుకోలేకపోయారు. బాన్సువాడ మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని తెరాస దక్కించుకుంది.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 12 వార్డులకు ఫలితాలు వెలువడ్డాయి. అధికార తెరాస పార్టీ 9 చోట్ల గెలవగా... మూడు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. భాజపా, ఎంఐఎం, ఇతరులకు ఒక్క చోట గెలవలేదు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో కారు పాగా వేసింది.
TAGGED:
kamareddy municipal election