కామారెడ్డి జిల్లా మద్నూరుకు చెందిన ఆటోడ్రైవర్లు తమకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ తహసీల్దార్ కృష్ణా నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు. లాక్డౌన్ కారణంగా పనిలేక పస్తులుంటున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదుకోవాలని ఆటోడ్రైవర్ల విజ్ఞప్తి - కామారెడ్డి మద్నూరు ఆటోడ్రైవర్లు
లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయామని కామారెడ్డి జిల్లా మద్నూరుకు చెందిన ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పని కల్పించి ఆదుకోవాలని తహసీల్దార్ కృష్ణా నాయక్‌కు వినతిపత్రం అందించారు.
ఆదుకోవాలని ఆటోడ్రైవర్ల విజ్ఞప్తి
నెల రోజులుగా ఆటోలు నడవక కుటుంబ పరిస్థితి ఇబ్బందిగా మారిందని వారు వాపోయారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకున్నారు.