కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేటలో అటవీశాఖ అధికారులను గ్రామస్థులు(Villagers vs forest officers) అడ్డుకున్నారు. రాజ్‌ఖాన్‌పేట అటవీ ప్రాంతంలో స్థానికులు ట్రాక్టర్లతో భూములు దున్నుతున్నారన్న సమాచారంతో... అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి వెళ్లిన అధికారులతో గ్రామస్థులు గొడవకు దిగారు.
Villagers vs forest officers: 'ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటాం'
కామారెడ్డి జిల్లా ఎల్లంపేటలో అటవీ అధికారులతో గ్రామస్థులు వాగ్వాదానికి(Villagers vs forest officers) దిగారు. అటవీ భూములు దున్నుతున్నారన్న సమాచారంతో అధికారులు అక్కడకు చేరుకున్నారు. కాగా స్థానిక మహిళలు పురుగులమందు డబ్బాలతో అధికారులను బెదిరించారు.
అటవీ అధికారులను అడ్డుకున్న గ్రామస్థులు, అధికారులతో గ్రామస్థుల వాగ్వాదం
ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటామని పురుగులమందు డబ్బాలు పట్టుకుని హెచ్చరించారు. ట్రాక్టర్లను తీసుకెళ్లనివ్వబోమని మహిళలు అడ్డుగా నిలబడడంతో అటవీశాఖ అధికారులు వెనుదిరిగారు.
ఇదీ చదవండి:Ganesh Immersion: గణేశ్ నిమజ్జనంపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ ఫోకస్