కామారెడ్డి జిల్లా బీర్కూర్, నసురుల్లాబాదు మండలం మైలారంలోని పల్లె వనాలను కలెక్టర్ శరత్ పరిశీలించారు. బెంచీలు, ఫౌంటేషన్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ కోరారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి పల్లె వనాలు దోహదపడతాయన్నారు.
పల్లె వనాలతో ఎంతో మేలు: కలెక్టర్ శరత్ - etv bharath
పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి పల్లె వనాలు దోహదపడతాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. జిల్లాలోని బీర్కూర్, నసురుల్లాబాదు మండలం మైలారంలోని పల్లె వనాలను పరిశీలించారు.
![పల్లె వనాలతో ఎంతో మేలు: కలెక్టర్ శరత్ kamareddy district collector sharath visit village parks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8777863-704-8777863-1599919793569.jpg)
పల్లె వనాలతో ఎంతో మేలు: కలెక్టర్ శరత్
జిల్లాలో ఇప్పటివరకు 104 రైతు వేదిక భవనాలు నిర్మాణంలో ఉండగా.. 75 భవనాల నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. 29 భవనాల నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. ఈనెల 15లోగా రైతు వేదిక భవనాల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లోని తడి పొడి చెత్తను షెడ్‌కి తరలించి సేంద్రియ ఎరువులను తయారు చేయాలన్నారు.