తెలంగాణ

telangana

ETV Bharat / state

బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన  కామారెడ్డి కలెక్టర్ - మినీ ట్యాంక్​బండ్

ప్రకృతిలో లభించే.. పూలను సేకరించి అందంగా అలంకరించి అమ్మవారిగా భావించి భక్తిశ్రద్ధలతో పూజలు చేసే ప్రత్యేక పండుగ బతుకమ్మ అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్​ శరత్​ అన్నారు. లింగంపేట మండలంలోని ఐలాపురం మినీ ట్యాంక్​బండ్​పై ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

Kamareddy District Collector Invented Bathukamma Statue
బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన  కామారెడ్డి కలెక్టర్

By

Published : Oct 24, 2020, 10:48 PM IST

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపురంలో మినీ ట్యాంక్ బండ్​పై బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దాతల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం అభినందనీయమని కొనియాడారు. గ్రామాభివృద్ధిలో యువకులు కీలక పాత్ర పోషించారని కితాబిచ్చారు. గ్రామాభివృద్ధికి రూ. 2లక్షల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆడపడుచులకు, ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు.

బతుకమ్మలను పెద్దగా పేర్చిన మహిళలకు కలెక్టర్ బహుమతులను ప్రదానం చేశారు. దాతలకు సన్మానం చేశారు. పూవులనే దేవతగా పూజించే ప్రత్యేక పద్ధతి తెలంగాణకే సొంతం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గరీబు ఉనీషా బేగం, జెడ్పిటిసి సభ్యురాలు శ్రీలత, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సంపత్ గౌడ్, ఎంపీడీవో మల్లికార్జున్ రెడ్డి, తహశీల్దార్ నారాయణ, సర్పంచ్ ధనలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:ఆత్మగౌరవంతో పండుగలు జరుపుకుంటున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABOUT THE AUTHOR

...view details