తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వం సూచించిన పంటలు పండించండి: కలెక్టర్​ - Awareness Program for Farmers on Monsoon Crops

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియంత్రిత సాగు విధానాన్ని రైతులందరూ పాటించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్​ శరత్​ కుమార్​ సూచించారు. ఈ విధానం ద్వారా అన్నదాతలు లాభపడతారని స్పష్టం చేశారు. దొడ్డురకం బియ్యాన్ని రైతులు పండించవద్దని తెలిపారు.

Kamareddy District Collector Awareness Program for Farmers on Monsoon Crops
ప్రభుత్వం సూచించిన పంటలు పండించండి

By

Published : May 28, 2020, 7:29 PM IST

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో వానాకాలం సాగు విధాన ప్రణాళికపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల మేలు కోసం నూతన సాగు ప్రణాళికలను సిద్ధం చేసిందని తెలిపారు.

ప్రతిసారి రైతులందరూ ఒకే రకమైన పంటలు పండించడం వల్ల మార్కెట్​లో వాటి డిమాండ్ తగ్గుతుందని... అందుకే రైతులకు గిట్టుబాటు ధర లభించటం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత నవీన కాలంలో ప్రతి ఒక్కరూ సన్న బియ్యం తినడానికే మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. దొడ్డురకం బియ్యం పండించటం వల్ల రైతులకు లాభాలు తెచ్చిపెట్టదని తెలిపారు. కావున రైతులు ప్రభుత్వం సూచించిన పంటలు వెయ్యాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details