కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత నేరస్థులకు సీఐ రామకృష్ణారెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు.
'నేరాల బాట వదలండి.. సరికొత్త జీవితాన్ని ప్రారంభించండి' - kamareddy updates
బాన్సువాడ పోలీస్ స్టేషన్లో పాత నేరస్థులకు సీఐ రామకృష్ణారెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. సక్రమమైన మార్గంలో నడుచుకోవాలని వారికి సూచించారు.
'సక్రమమైన మార్గంలో నడుచుకోండి'
నేరాలకు పాల్పడకుండా సక్రమమైన మార్గంలో నడుచుకోవాలని సూచించిన సీఐ.. తిరిగి దొంగతనాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేర ప్రవృత్తి వదిలి కుటుంబ సభ్యులతో ఆనందంగా పనిచేసుకుంటూ గడపాలని కోరారు.
ఇదీ చదవండి:ఈనెల 16 నుంచే.. వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం