తెలంగాణ

telangana

ETV Bharat / state

కేజీబీవీ కరోనా కలకలం.. ఎస్.ఓపై కలెక్టర్ ఆగ్రహం - కొవిడ్​ బారిన పడ్డ విద్యార్థులు

రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. కామారెడ్డి జిల్లాలో.. కొవిడ్ బారిన పడ్డ కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ శరత్ నేడు సందర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన.. యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

kamareddy collector visited corona affected kgbv school
కేజీబీవీ కరోనా కలకలం.. ఎస్.ఓపై కలెక్టర్ ఆగ్రహం

By

Published : Mar 17, 2021, 11:44 AM IST

కామారెడ్డి జిల్లాలోని కేజీబీవీ పాఠశాలను.. కలెక్టర్ శరత్ సందర్శించారు. కొవిడ్​ బారిన పడ్డ 32 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని.. వైద్యులనడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఎస్.ఓ లావణ్యపై​ ఆగ్రహం వ్యక్తం చేశారు​. ఓ వైపు.. ప్రభుత్వం టీకా పంపిణీ చేస్తూ నివారణకు కృషి చేస్తుంటే.. నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని నిలదీశారు.

ఇంటికి వెళ్లి వచ్చిన విద్యార్థులను ఐసోలేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు​. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు​. ఎవరు భయపడవద్దని వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో.. జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఆర్డీఓ శ్రీను, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ సుస్మిత రాయ్, కౌన్సిలర్ శంకర్ రావు, తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి:రయ్‌రయ్‌మంటూ బండితో రోడ్లపై దూసుకెళ్తున్న మైనర్లు

ABOUT THE AUTHOR

...view details