తెలంగాణ

telangana

ETV Bharat / state

కామారెడ్డి కలెక్టర్ సుడిగాలి పర్యటన - Kamareddy Collector Sudden Inspection In bebepet

కామారెడ్డి జిల్లా కలెక్టర్​ శరత్​ కుమార్​ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ప్రజలకు కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.

Kamareddy Collector Sudden Inspection In bebepet
కామారెడ్డి కలెక్టర్ సుడిగాలి పర్యటన

By

Published : May 5, 2020, 9:56 PM IST

కామారెడ్డి జిల్లా బీబీపేట్​ మండలంలో జిల్లా కలెక్టర్​ శరత్​ కుమార్​ సుడిగాలి పర్యటన చేశారు. బీబీపేట్​ మండల కేంద్రంలో పర్యటించి ఉపాధి హామీ పనులు, హరితవనం, వైకుంఠధామం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పించారు.వైరస్​ బారిన పడకుండా ఉండాలంటే.. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ప్రజలకు చెప్పారు. హరితహారంలో నాటిన మొక్కలు పరిరక్షించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details