కామారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ పరిశీలించారు. ఓటింగ్ ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ పోలింగ్ కేంద్రంలో 57 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలను పాటిస్తున్నామని.. అలాగే ప్రతి ఒక్క ఓటర్కి ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. అంతేగాక ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద ఒక మెడికల్ అధికారిని అందుబాటులో ఉంచామన్నారు.