తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈనెల 17 నుంచి ఎన్నికల అధికారులకు శిక్షణ' - kamareddy collector satya narayana visit strong rooms for municipal election

పుర ఎన్నికల నేపథ్యంలో ఎల్లారెడ్డిలోని ఆదర్శ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్​లను కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పరిశీలించారు.

collector visit strong rooms for municipal election
'ఈనెల 17 నుంచి ఎన్నికల అధికారులకు శిక్షణ'

By

Published : Jan 14, 2020, 3:29 PM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని పుర ఎన్నికల్లో భాగంగా ఆదర్శ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్​లను ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కళాశాలను పరిశీలించారు.

'ఈనెల 17 నుంచి ఎన్నికల అధికారులకు శిక్షణ'
ఎన్నికల నిమిత్తం అధికారులను నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేట్టుగా పోలీసులు గట్టి బందోబస్తు ఇవ్వాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details