కామారెడ్డి కలెక్టర్ శరత్.. సెల్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్సీ కేంద్రాల వైద్యాధికారులతో సమీక్షించారు. కొవిడ్ రెండో దశ నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి వారితో చర్చించారు. ప్రైమరీ కాంటాక్ట్స్ పరీక్షలను అధిక శాతం నిర్వహించాలని సూచించారు.
'ప్రైమరీ కాంటాక్ట్స్ పరీక్షలపై దృష్టి పెట్టండి'
రాష్ట్రంలో రెండో దశ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజువారీ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి కలెక్టర్.. జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్సీ కేంద్రాల వైద్యాధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కామరెడ్డి కలెక్టరేట్
కేంద్రాల వారీగా.. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి.. వాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ పాయింట్లను పెంచి.. రోజు వారి టార్గెట్ను సాధించాలని సూచించారు. చెక్ పోస్టుల వద్ద ఎక్కువ పరీక్షలు నిర్వహించాల్సిందిగా కోరారు.