కంటైన్మెంట్ జోన్, హాట్స్పాట్లలో రోజూ వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ సూచించారు. బాన్సువాడలోని ఎంపీడీవో కార్యాలయంలో వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. క్వారంటైన్లో ఉన్నవారి ఆరోగ్య స్థితిని పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలని సిబ్బందికి సూచనలు చేశారు. చిన్న పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలన్నారు.