తెలంగాణ

telangana

ETV Bharat / state

'లాక్​డౌన్​ అతిక్రమిస్తే జైలు శిక్ష' - Kamareddy collector review on Corona in district

కామారెడ్డి జిల్లాలో కరోనా వైరస్​ పాజిటివ్​ కేసుల సంఖ్య పెరిగిపోతుండటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. నియంత్రణ చర్యలో భాగంగా ఇవాళ అధికారులతో కలెక్టర్ శరత్ సమీక్ష నిర్వహించారు. లాక్​డౌన్​ అతిక్రమించిన వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.

KAMAREDDY COLLECTOR
'లాక్​డౌన్​ అతిక్రమిస్తే జైలు శిక్ష'

By

Published : Apr 11, 2020, 5:26 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగతుండటం వల్ల వైరస్ నియంత్రణ చేయుట కొరుకు పట్టణంలో కలెక్టర్ శరత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారితో ప్రైమరీ కాంటాక్ట్, అలాగే సెకండరీ కాంటాక్ట్ ఉన్న వారి ఇంటికి ప్రతిరోజూ వైద్యాధికారులు వెళ్లి పరిశీలన చేయాలని తెలిపారు. పట్టణంలోకి కొత్తగా వచ్చిన వారిని క్వారంటైన్​ కేంద్రాలకు తరలించాలని కోరారు.

ప్రతి రోజూ పట్టణమంతా రసాయన పిచికారి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించేవిధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లాక్​డౌన్ అతిక్రమించిన వారిపై నాన్ బెయిలబుల్ కేసు, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

ఇదీ చూడండి:భారత్​కు ఏడీబీ 220 కోట్ల​ డాలర్ల సాయం

ABOUT THE AUTHOR

...view details