రెండు కేజీల ప్లాస్టిక్ తెస్తే..అరడజను గుడ్లు - kamareddy collector participated in swacha activities in ellareddy
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 30 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఎవరైతే రెండు కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి తెస్తే వారికి అరడజను గుడ్లు ఇస్తామన్నారు.

ప్లాస్టిక్ నిషేధంపై గ్రామపంచాయతీల, మున్సిపాలిటీల్లో ప్రజల్లో అవగాహన కల్పించేలా... ఎవరైతే రెండు కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి తెస్తే అరడజను గుడ్లు ఇస్తామన్నారు కామారెడ్డి జిల్లా కలెక్టర్. మున్సిపాలిటీలో 30రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఈ మూడు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం కోసం ట్రాక్టర్ల కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఎల్లారెడ్డి మునిసిపాలిటీ బడ్జెట్ లేకపోవడం వల్ల జిల్లా కేంద్రం నుంచి రూ. 40 లక్షల నిధులను కేటాయించామన్నారు. మురికి కాలువల్లో ప్రతి శుక్రవారం యాంటీ లార్వా లాయల్ బాల్స్ వేయాలన్నారు.