ఎమ్మెల్సీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని.. ఆలయంలో వేడుకలు నిర్వహించడంపై కామారెడ్డి భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణతారా మండిపడ్డారు. కేక్ కోసి.. ఆలయ పవిత్రతకు భంగం కలిగించిన ఎమ్మెల్యే హన్మంత్ షిండే తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆలయంలో ఎమ్మెల్సీ బర్త్డే వేడుకలు.. ఖండించిన భాజపా
ఎమ్మెల్సీ కవిత జన్మదినం రోజున ఆలయంలో వేడుకలు జరిపిన జుక్కల్ ఎమ్మెల్యేపై కామారెడ్డి భాజపా జిల్లా అధ్యక్షురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర స్థలాల్లో.. కొవ్వొత్తులు ఆర్పూతూ, కేకులు కోయాడాన్ని ఆమె ఖండించారు.
ఆలయంలో ఎమ్మెల్సీ బర్త్డే వేడుకలు.. ఖండించిన భాజపా
ఈ నెల 13న ఎమ్మెల్సీ జన్మదినం సందర్భంగా.. మద్నూర్ మండలం సలాబత్ పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే, తెరాస నేతలతో కలిసి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అరుణతారా తీవ్రంగా ఖండించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆలయాన్ని శుద్ధి చేశారు. నిరసనగా.. వేద పండితులతో ప్రత్యేక పూజలు జరిపించారు.
ఇదీ చదవండి:ఏప్రిల్ 9న పార్టీ ప్రకటిస్తా: వైఎస్ షర్మిల