న్యాయవాది వామన్రావు దంపతుల హత్యకేసు నిందితులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కామారెడ్డి బార్ అసోసియేషన్ విమర్శించింది. ఆ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ.. జిల్లా కేంద్రంలోని కోర్టు వద్ద మూడురోజుల రిలే నిరాహార దీక్షను న్యాయవాదులు ప్రారంభించారు.
న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని బార్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వామన్రావు కుటుంబానికి రూ. 5 కోట్ల నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్ రావు, సెక్రటరీ సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీధర్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.