మనుషులు బ్రతికి ఉన్నప్పుడే కాదు చనిపోయినా కష్టాలు తప్పడం లేదు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని ఆత్మకూర్, చిన్న ఆత్మకూర్ గ్రామాలకు ఒకే శ్మశాన వాటిక ఉంది. రెండు గ్రామాలకు కలిపి సుమారు మూడు ఎకరాల స్థలం ఉంది. కానీ వెళ్లే మార్గం మొత్తం కబ్జాకు గురైంది. దారికి ఇరుపక్కలా ఉన్న రైతులు చదును చేసి సాగు చేస్తున్నారు. రాయచోటి రాములు అనారోగ్యంతో మృతి చెందాడు. పడుతూ, లేస్తూ శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆశ్రయించినా ఫలితం లేదని గ్రామస్థుులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్మశానానికి వెళ్లాలంటే నరకమే..! - కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలోని రెండు గ్రామాలకు కలిపి ఒకే శ్మశానం ఉంది. అధికారులను సంప్రదించినా పరిష్కరం మార్గం కనపడడం లేదని గ్రామస్థుులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాటికి వెళ్లాలంటే నరకమే..!