కామారెడ్డి ప్రాంతీయ ఆస్పత్రిలో కరోనా అనుమానితుల నుంచి సేకరించిన శాంపిళ్లను జాగ్రత్తపరచడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. శాంపిళ్లను సక్రమంగా ప్యాకింగ్ చేయకపోవడం వల్ల హైదరాబాద్ చేరకముందే అవి లీకవుతున్నాయి. లీకైన శాంపిళ్లను గాంధీ ఆస్పత్రి సిబ్బంది వెనక్కు పంపిస్తున్నారు. దీనివల్ల కరోనా కేసులకు సంబంధించి పూర్తి వివరాలు నమోదు కావడం లేదు.
సిబ్బంది నిర్లక్ష్యం.. లీకవుతున్న కరోనా అనుమానితుల రక్త నమూనాలు - kamareddy area hospital staff negligence in storing corona samples
కరోనా అనుమానితుల శాంపిళ్లను జాగ్రత్తపరచడంలో కామారెడ్డి జిల్లా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. శాంపిల్స్ హైదరాబాద్ చేరకముందే లీకవ్వడం వల్ల తిరస్కరణకు గురవుతున్నాయి.
శాంపిళ్లను జాగ్రత్తపరచడంలో నిర్లక్ష్యం వహించిన ల్యాబ్ టెక్నీషియన్‌కు ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు. ఈనెల 26న కామారెడ్డి ఆస్పత్రి నుంచి పంపించిన 149 శాంపిళ్లలో 89 లీకవ్వడం వల్ల గాంధీ ఆస్పత్రి సిబ్బంది వాటిని తిరస్కరించారు. జూన్‌లో సేకరించిన శాంపిళ్లను హైదరాబాద్‌కు పంపకపోవడం వల్ల మళ్లీ శాంపిల్స్‌ను సేకరించాల్సి వచ్చింది.
ఈ ఘటనపై మారెడ్డి ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్ స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ల్యాబ్ టెక్నీషియన్‌కు మెమో జారీ చేసినట్లు తెలిపారు.