కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని రాంపూర్ గ్రామంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ - బాన్సువాడ ఫిదా సినిమా షూటింగ్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో రెండు పడకల గదుల నిర్మాణానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
'డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ'
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, ఎంపీపీ వెంకటరామిరెడ్డి, జడ్పీటీసీ గోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.