నాణ్యమైన పోషకాహారాన్ని భుజించాలని సినీ నటుడు రాంచరణ్ సతీమణీ ఉపాసన అన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండలో గడీకోట, గ్రామాభివృద్ధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహారం వితరణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. దోమకొండ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు మార్చి 10 వరకు అపోలో ఆసుపత్రి వారు సూచించిన ప్రకారం వారానికి ఏడు రకాలైన ఆహారం అందివ్వడానికి ఆమె ముందుకొచ్చారు.
ఉపాసనే స్వయంగా విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు స్వయంగా ఉపాసన రావటం పట్ల గ్రామస్థులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.