తెలంగాణ ఉద్యమంలో ప్రధానపాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులను ముఖ్యమంత్రి కేసీఆర్ విధుల నుంచి తొలగించామని బెదిరించడం సరికాదని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా ప్రతినిధి సాయా గౌడ్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని...ఆర్టీసీని ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
'ఆర్టీసీ కార్మికులను తొలగించామనడం సరికాదు' - తెలంగాణ ఉద్యమం
సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులను విధుల నుంచి తొలగించామనడం సరికాదని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా ప్రతినిధి సాయా గౌడ్ అన్నారు.

ఆర్టీసీ కార్మికులను తొలగిస్తాననడం సరికాదు: సాయా గౌడ్
ఆర్టీసీ కార్మికులను తొలగిస్తాననడం సరికాదు: సాయా గౌడ్
ఇదీ చూడండి: ప్లాస్టిక్ రహిత తెలంగాణే లక్ష్యం: కేసీఆర్