కామారెడ్డి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్వేతా, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే హాజరయ్యారు. ప్రతి స్త్రీ పురుషుడితో సమానమని శ్వేతా తెలిపారు. తల్లిదండ్రులు ఇంట్లో స్త్రీ, పురష భేదం చూపించరాదని సూచించారు.
'ప్రతి స్త్రీ పురుషుడితో సమానమే' - మహిళా దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
'ప్రతి స్త్రీ పురుషుడితో సమానమే'
మహిళలు ఆత్మ రక్షణ కోసం విద్యలు నేర్చుకోవాలని శ్వేతా అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్ చేయాలని సూచించారు.
ఇవీ చూడండి:వ్యవసాయానికి నూతన జవసత్వాలు: హరీశ్ రావు