తెలంగాణ

telangana

ETV Bharat / state

లింగంపేట్​లోని విత్తనాల దుకాణాల్లో తనిఖీలు - inspection at seeds shop

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని విత్తనాల దుకాణాలపై ఏడీఏ రత్నం, టాస్క్​ఫోర్స్​ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వ అనుమతి పొందిన లైసెన్స్​ కలిగిన దుకాణాల నుంచే విత్తనాలు కొనాలని ఆమె సూచించారు.

విత్తనాల దుకాణాల్లో తనిఖీలు

By

Published : May 27, 2019, 4:02 PM IST

కామారెడ్డి జిల్లా లింగంపేట్​ మండల కేంద్రంలో సోమవారం పోలీస్​ అధికారుల బృందంతో కలిసి వ్యవసాయ అధికారులు విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. విత్తనాలు, వాటిని ఉత్పత్తి చేసిన కంపెనీల వివరాలు సేకరించారు. ప్రతి కొనుగోలుకు బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. గ్రామాల్లో విత్తనం కొనేటప్పుడు నకిలీవనే అనుమానం వస్తే తమకు సమాచారం అందించాలని ఏడీఏ రత్నం తెలిపారు.

విత్తనాల దుకాణాల్లో తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details