కామారెడ్డి జిల్లా బాన్సువాడలో విషాదం జరిగింది. వైద్యులు అందుబాటులో లేక నర్సులే కాన్పు చేయడం వల్ల బిడ్డ మృతిచెందాడని బంధువులు ఆరోపించారు. బిచ్కుంద మండలం పెద్దదడ్గికి చెందిన సవిత పురిటి కోసం మంగళవారం రాత్రి బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చేరింది.
బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో శిశువు మృతి - వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి
బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో శిశువు మృతి చెందాడు. వైద్యులు అందుబాటులో లేక.. నర్సులే కాన్పు చేయడం వల్ల బిడ్డ దక్కలేదని బంధువులు ఆరోపించారు.
బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో శిశువు మృతి
ఆస్పత్రిలో ప్రసూతి వైద్యురాలు అందుబాటులో లేకపోవడం వల్ల సిబ్బంది కాన్పు చేశారు. పురిట్లోనే శిశువు మృతి చెందింది. వైద్యులు లేక సిబ్బంది కాన్పు చేయడం వల్లనే తమ బిడ్డ దక్కలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి :ఈనాడు-ఈటీవీ భారత్ చొరవ.. వలస కూలీలకు ఎర్రబెల్లి చేయూత