కామారెడ్డి జిల్లా కేంద్రంలో 10వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పోలీసులకు కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. రాజేష్ అనే కండక్టర్‌కు కుడి చేయి విరిగింది. తోటి కార్మికులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమ్మెలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ శవయాత్రను నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని ఆపడానికి ప్రయత్నించడం వల్ల ఘర్షణ చోటుచేసుకుంది.
శవయాత్రలో తోపులాట.. ఒకరికి గాయాలు - ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ శవయాత్ర
కామారెడ్డి జిల్లా కేంద్రంలో 10వ రోజు కొనసాగుతోన్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ శవయాత్రలో పోలీసులకు కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఆర్టీసీ కార్మికుడి చేయి విరగింది. బాధితుణ్ని స్థానికి ఆస్పత్రికి తరలించారు.

శవయాత్రలో తోపులాట.. ఒకరికి గాయాలు
శవయాత్రలో తోపులాట.. ఒకరికి గాయాలు