తెలంగాణ

telangana

ETV Bharat / state

మా గ్రామంలోనే ధాన్యాన్ని కొనాలి: ఇల్చిపూర్​ రైతులు - కామారెడ్డి జిల్లా వార్తలు

తమ గ్రామంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా ఇల్చిపూర్ రైతులు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు తమ గ్రామంలోనే ధాన్యాన్ని కొంటామని చెప్పిన అధికారులు.. కొనుగోలు కేంద్రాన్ని పక్క గ్రామానికి ఎలా మారుస్తారని నిలదీశారు. లాక్​డౌన్​ను అధికారులు దృష్టిలో పెట్టుకుని తమ గ్రామంలోనే వరిని కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

ilchipur farmer demand for grain buying center
మా గ్రామంలోనే ధాన్యాన్ని కొనాలి: ఇల్చిపూర్​ రైతులు

By

Published : Apr 24, 2020, 11:34 PM IST

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఇల్చిపూర్ గ్రామ రైతులు నిరసనకు దిగారు. వరి,ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తమ గ్రామంలోనే ఏర్పాటు చేయాలని ఆందోళన నిర్వహించారు. మొన్నటి వరకు తమ ఊర్లోనే ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తాము రూ.30,000 ఖర్చు చేసి.. స్థలాన్ని మొత్తం చదును చేశామని తెలిపారు.

ఇప్పుడు పక్క గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సబబు కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్లూరు గ్రామంలోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారని వాపోయారు. ఇప్పటికిప్పుడు ధాన్యాన్ని ప్రక్క గ్రామానికి తరలించడం సాధ్యంకాదని ఆవేదన వ్యక్తం చేశారు. వాతవరణ పరిస్థితులు, లాక్​డౌన్​ను అధికారులు దృష్టిలో పెట్టుకుని తమ గ్రామంలోనే వరిని కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

రైతుల్లో చాలా మంది మహిళలమున్నాం. పక్క ఊరికి వెళ్లి రావలంటే ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతం కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ఏ గ్రామంలో ధాన్యాన్ని అక్కడే కొనుగోలు చేయాలి - సత్తెమ్మ, మహిళా రైతు.

ఇవీ చూడండి:దయచేసి ధాన్యాన్ని తగలబెట్టకండి: గంగుల

ABOUT THE AUTHOR

...view details