కామారెడ్డి జిల్లాలోని బిక్కనూర్, నాగిరెడ్డిపేట మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో ఏడు శాతం పాజిటివ్ రేటు ఉందని ఐసీఎంఆర్ సమన్వయకర్త దినేష్ కుమార్ తెలిపారు. నల్గొండ, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో ఆగస్టు నెలలో రెండో విడత సర్వే నిర్వహించామన్నారు. ఈ జిల్లాల కన్నా కామారెడ్డిలో పాజిటివ్ శాతం తక్కువగా నమోదైందని పేర్కొన్నారు.
నల్గొండ, జనగామ జిల్లాల కన్నా కామారెడ్డిలో తక్కువ - telangana news
నల్గొండ, జనగామ జిల్లాల కన్నా కామారెడ్డిలో కరోనా పాజిటివ్ శాతం తక్కువగా నమోదైందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సమన్వయకర్త దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఆగస్టు నెలలో ఈ జిల్లాల్లో రెండో విడత సర్వే నిర్వహించామని తెలిపారు. డిసెంబర్ 21 నుంచి మూడో విడత సర్వే చేపడతామన్నారు.
నల్గొండ, జనగామ జిల్లాల కన్నా కామారెడ్డిలో తక్కువ
జిల్లా కలెక్టర్ డా.శరత్ ఆధ్వర్యంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా నిర్ధరణ పరీక్షలు పెంచారని.. పోలీస్, వైద్యశాఖ, ఇతర శాఖల సమన్వయంతో పనిచేసి కరోనా కేసులు తగ్గించారని ఆయన పేర్కొన్నారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని కోరారు. తప్పనిసరిగా శానిటైజర్ వాడాలని సూచించారు. డిసెంబర్ 21 నుంచి ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో మూడో విడత సర్వేను చేపడతామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నేరస్థుల పాలిట సింహ స్వప్నంగా రాచకొండ కమిషనరేట్