కరోనా కారణంగా భార్యాభర్తలు మృతిచెందిన ఘటన... కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మూడు రోజుల కిందట యాట సైదులు అనే వ్యక్తి కొవిడ్‌తో మృతి చెందగా... నేడు ఆయన భార్య యాట బాగవ్వ (66) మరణించింది. ఈ నెల 15న త్రీవ జర్వంతో దంపతులిద్దరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది.
మూడురోజుల వ్యవధిలో కరోనాతో భార్యాభర్తలు మృతి - కామారెడ్డి జిల్లా తాజా వార్తలు
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో కరోనా మహమ్మారి భార్యాభర్తలను బలితీసుకుంది. మూడు రోజుల కిందట యాట సైదులు అనే వ్యక్తి కొవిడ్‌తో మృతి చెందగా... నేడు ఆయన భార్య ప్రాణాలు కోల్పోయింది. వారి మరణంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
![మూడురోజుల వ్యవధిలో కరోనాతో భార్యాభర్తలు మృతి Husband and wife die with Corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11508518-310-11508518-1619163974921.jpg)
కరోనాతో భార్యాభర్తలు మృతి
అప్పటినుంచి ఇద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉంటూ మందులు వాడుతున్నారు. మూడు రోజుల కిందట కొవిడ్‌తో భర్త మృతిచెందాడు. ఈ రోజు భార్య ప్రాణాలు కోల్పోయింది. కరోనాతో బిర్కుర్ మండల కేంద్రంలో ఇద్దరూ చనిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ కొరతపై కేంద్రానికి రాహుల్ చురకలు