తెలంగాణ

telangana

By

Published : May 3, 2020, 9:02 PM IST

ETV Bharat / state

కరోనా కట్టడికై చెక్​పోస్టుల వద్ద భారీ బందోబస్తు

కరోనా కట్టడిం కోసం అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీలను పలు శాఖల అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు వంటి విషయాలను తెలుసుకుంటున్నారు. క్వారంటైన్ ముద్రలు వేసి మరీ కూలీలను స్వస్థలాలకు పంపిస్తున్నారు.

THERMAL SCREENING TESTS IN CHECK POSTS
కరోనా కట్టడికై చెక్​పోస్టుల వద్ద భారీ బందోబస్తు

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్ పూర్ సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద వివిధ శాఖల అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకుని దస్త్రాల్లో నమోదు చేసుకుంటున్నారు. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు..? ఎక్కడికి వెళ్లాలి..? అనే ప్రశ్నలు వేస్తున్నారు.

వారి చరవాణి నెంబర్లను నమోదు చేసుకుంటున్నారు. సరిహద్దు మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి పూర్తి వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. వైద్య పరీక్షలతో పాటు సరిహద్దు మీదుగా వెళ్లే వలస కూలీల చేతులకు క్వారంటైన్ ముద్రలు వేసి పంపిస్తున్నారు.

ఇవీ చూడండి:క్షేత్రస్థాయిలో నిఘా: ఆ సడలింపులు ఇద్దామా? వద్దా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details