తెలంగాణ

telangana

ETV Bharat / state

కూలిన ఇంటి కప్పు.. ముగ్గురు చిన్నారులకు స్వల్ప గాయాలు - MAALOTH VILLAGE, KAMAREDDY DISTRICT

కామారెడ్డి జిల్లా లింపంపేట మండల పరిధిలోని మాలోత్ తండాలో ఈదురు గాలులకు ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఈదురు గాలులకు ఎగిరిపోయిన ఇంటి పైకప్పు
ఈదురు గాలులకు ఎగిరిపోయిన ఇంటి పైకప్పు

By

Published : Apr 29, 2020, 6:08 PM IST

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని మాలోత్ తండాలో ఈదురు గాలులకు ఓ ఇంటిపై కప్పు రేకులు ఎగిరిపోయి ముగ్గురు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు సంగీత, శిరీష, మీనాలను లింగంపేట ఆస్పత్రికి తరలించారు. ఈదురు గాలులకు ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయి తాము తీవ్ర అవస్థలు పడుతున్నామని బాధితులు వాపోయారు. ఇంటిపై కప్పు కూలి ఆర్థికంగానూ నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details