తెలంగాణ

telangana

ETV Bharat / state

మందేశారు.. ఆసుపత్రిలో సామగ్రి ధ్వంసం చేశారు - మద్యం మత్తులో ఆసుపత్రిలో సామగ్రి ధ్వంసం చేసిన యువకులు

మద్యం మత్తులో ఆరుగురు యువకులు ఆసుపత్రిలో సామగ్రి ధ్వంసం చేసిన ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్​ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యువకులను సముదాయించి పంపించారు.

hospital staff protest at madnur hospital to take action on destroyers
మద్యం మత్తులో ఆసుపత్రిలో సామగ్రి ధ్వంసం చేసిన యువకులు

By

Published : Sep 19, 2020, 12:57 PM IST

కామారెడ్డి జిల్లా మద్నూర్​ ప్రభుత్వ ఆసుపత్రిలో మద్యం మత్తులో ఆరుగురు యువకులు.. ఆసుపత్రి సామగ్రిని ధ్వంసం చేశారు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఆ యువకులు ఆసుపత్రిలోకి వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. మహిళా వైద్య సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించి గొడవకు దిగినట్లు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.

యువకుల దాడిలో కుర్చీలు, పెద్దపెద్ద గ్లాసులు మిగిలిపోయాయి. వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వగా ఎస్సై సురేష్​ వచ్చి యువకులను సముదాయించినట్లు సిబ్బంది వివరించారు. దాడి చేసి సామగ్రి ధ్వంసం చేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదని సిబ్బంది వాపోతున్నారు. రాత్రి ఘటన జరిగితే ఉదయం వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి :యాదాద్రి ఆలయంలో ఆకట్టుకుంటున్న నిర్మాణ పనులు

ABOUT THE AUTHOR

...view details