తెలంగాణ

telangana

ETV Bharat / state

రోగ నిరోధక శక్తి పెంపునకు హోమియోపతి కిట్లు పంపిణీ - ఎల్లారెడ్డిలో హోమియోపతి మాత్రల పంపిణీ

రోగ నిరోధక శక్తి పెంపునకు హోమియోపతి మాత్రలను కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాల్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే సురేందర్​ పంపిణీ చేశారు. కరోనాను తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.

homeopathy medicine distribution by mla surender at yellareddy in kamareddy district
రోగ నిరోధక శక్తి పెంపునకు హోమియోపతి కిట్లు పంపిణీ

By

Published : Jul 29, 2020, 6:59 PM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాల్ పరిధిలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఇమ్యూనిటీ బూస్టర్ కిట్లను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీపాటిల్ ఉచితంగా తన స్వంత ఖర్చులతో పంపిణీ చేస్తున్నారు. కాగా రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఈ కిట్లను ఎల్లారెడ్డి మండల గ్రామ సర్పంచ్​లు, ఎంపీటీసీలు, కార్యకర్తలకు స్థానిక ఎమ్మెల్యే సురేందర్ అందజేశారు.

ఎల్లారెడ్డిలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఎమ్మెల్యే సురేందర్​ ఆందోళన వ్యక్తం చేశారు. కావున ప్రతీ ఒక్కరు ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే మాస్కులు ధరించి.. భౌతిక దూరాన్ని పాటించాలని.. రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారం, కషాయం తీసుకోవాలని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

ABOUT THE AUTHOR

...view details