కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇస్సాయిపేటలో దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన రావణ దహనం... ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పలువురికి గాయాలయ్యాయి. రావణ దహనం చేయకూడదని ఓ వర్గం వారు అభ్యంతరం చెప్పారు. వాగ్వాదం పెద్దదై ఊరినే రెండు ముక్కలుగా చేసేంతగా మారాయి. సద్దుమణిగాయి అనుకున్న వివాదం బుధవారం ఉదయం మళ్లీ చెలరేగింది. కామారెడ్డి పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి... డీఎస్పీ ఆధ్వర్యంలో పికెట్ నిర్వహించారు. శాంతియుతంగా మెలగాలని సర్దిచెప్పారు. దుర్గామాత నిమజ్జనం అయ్యే వరకు పోలీసు పహారా నిర్వహించారు. పోలీసు బందోబస్తు నడుమ ఊరు రణరంగంగా మారింది.
రావణ దహనం వివాదం... రణరంగంగా మారిన ఊరు - high alert in isaipeta
కామారెడ్డి జిల్లా ఇస్సాయిపేటలో మంగళవారం జరిగిన దసరా వేడుకల్లో వివాదం చిలికిచిలికి పెద్దదైంది. డీఎస్పీ ఆధ్వర్యంలో గ్రామంలో పికెట్ నిర్వహించారు.

రావణ దహనం వివాదం... రణరంగంగా మారిన ఊరు
రావణ దహనం వివాదం... రణరంగంగా మారిన ఊరు