కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం గుండా ప్రవహించే కూడవెల్లి వాగు గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు కూడవెల్లి వాగు సరిహద్దుగా ప్రవహిస్తోంది.
భారీ వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కూడవెల్లి వాగు
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలోని కూడవెల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కూడవెల్లి వాగులో నీటి ప్రవాహం చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కూడవెల్లి వాగు
రెండు జిల్లాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు నీటిని అందిస్తూ, ఇది మానేరు నదిలో కలుస్తుంది. కూడవెల్లి వాగులో ఏటా ఒకసారి జనాలు పెద్ద సంఖ్యలో సామూహిక స్నానం చేసుకుని ఒడ్డున ఉన్న శివుణ్ణి దర్శనం చేసుకుంటారు. కూడవెల్లి వాగులో నీటి ప్రవాహం చూసి జనాలు సంతోషిస్తున్నారు.
ఇవీ చూడండి: పొంగిపొర్లుతున్న లక్నవరం చెరువు, జంపన్న వాగు