నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లాలో చిన్న చిన్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కల్యాణి ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి 220క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రధాన కాలువకు విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటి మట్టం 409.50మీటర్లు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 408.90 మీటర్లుగా ఉంది. సింగీతం ప్రాజెక్టులోకి 200 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా.. పూర్తి నీటి మట్టం 416.550 మీటర్లు అయితే ప్రస్తుత నీటి మట్టం 415.90 మీటర్లుగా ఉంది.
విస్తారంగా వర్షాలు... జళకళను సంతరించుకున్న ప్రాజెక్టులు - ప్రాజెక్టులు
కామారెడ్డి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. చిన్న చిన్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. నిజాంసాగర్ మండలంలోని కల్యాణి, సింగీతం ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి.
పోచారం ప్రాజెక్టులోకి 1677 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. పూర్తి నీటి నిల్వ 1.820 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.502 టీఎంసీల నీరు ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 784 క్యూసెక్కుల స్వల్ప ప్రవాహం ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.037 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులో ఉంది. కాగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీర్కూర్ మండలం బైరాపూర్లో రేకుల ఇల్లు గోడ కూలింది. అన్నారం గ్రామంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉన్న వారిని జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.