కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సింగూరు ప్రాజెక్టు ద్వారా 40,829 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తున్నాయి. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులకుగాను 1398.46 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 9.778 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నిండుకుండలా మారిన నిజాంసాగర్ ప్రాజెక్టు - Nizam sagar Full water level latest news
వాయుగుండం ప్రభావంతో కామారెడ్డి జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు నీరు వచ్చి చేరుతుంది. ఈ కారణంగా జలాశయం నిండుకుండను తలపిస్తోంది.
నిండుకుండలా మారిన నిజాంసాగర్ ప్రాజెక్టు
వరదలు ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుందని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మంజీర పరివాహక ప్రాంతాల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.