కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జలాశయానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ప్రాజెక్టులో నీళ్లు రావడం వల్ల జలాశయం వద్ద సందడి నెలకొంది. కాగా ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేశారు. వరద ప్రవాహం వైపు ఎవరూ దిగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.
11 గేట్లు ఎత్తివేత..
ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1, 405 అడుగులు కాగా ప్రస్తుతం 1, 403.92 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో నీటి నిల్వ 17.802 టీఎంసీలకు గాను 16.247 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 62, 517 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతోంది. 11 గేట్ల ద్వారా 72,702 క్యూసెక్కుల వరద నీరు దిగువ ప్రాంతానికి వదులుతున్నారు.
నిండుకుండలా నిజాంసాగర్ జలాశయం.. పోటెత్తిన పర్యాటకులు ఇదీ చూడండి:నిజాంసాగర్ వరదతో.. మంజీరా నదికి జలకళ