కామారెడ్డిలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య - head cantabile suicide in kamareddy district latest news
15:27 January 29
కామారెడ్డిలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీసుస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ లచ్చగౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ వెనుక బ్యారెక్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. హెడ్ కానిస్టేబుల్ మృతికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది అని జిల్లా ఎస్పీ శ్వేత తెలిపారు.
లచ్చగౌడ్ స్వస్థలం జనగామ. మృతుడి భార్య సుజాత, కొడుకు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.