కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం అంబారిపేటలో కలెక్టర్ సత్యనారాయణ పర్యటించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పర్యవేక్షించారు. ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త వాటిని నాటి నీరు పోశారు. మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా హరితహారం సంపూర్ణంగా అమలుచేసి రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలనే సీఎం కేసీఆర్ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. చెట్లు ఉంటేనే భవిష్యత్తు బాగుపడుతుందని... లేకుంటే దిల్లీ లాంటి పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు.
'రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చుదాం' - HARITHA HARAM PROGRAM IN KAMAREDDY AMBARIPET
హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్లో ఎండిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటారు కామారెడ్డి జిల్లా పాలనాధికారి సత్యనారాయణ. అంబారిపేటలో పర్యటించిన కలెక్టర్... రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలని ప్రజలకు సూచించారు.

HARITHA HARAM PROGRAM IN KAMAREDDY AMBARIPET