తెలంగాణ ప్రభుత్వం ఏంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారంలో రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో కరువు కాటకాలు రాకుండా వర్షాలు బాగా కురవాలంటే అడవుల శాతం పెంచాలన్నారు. 5వ విడత హరితహారంలో ప్రభుత్వం 230 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్, డీఎస్పీ యాదగిరి, పురపాలక కమిషనర్ కుమారస్వామి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో హరితహారంలో పాల్గొన్న సభాపతి - సభాపతి
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో హరితహారం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు.
కామారెడ్డి జిల్లాలో హరితహారంలో పాల్గొన్న సభాపతి