Harishrao Comments on Opposition Parties : రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలాప్రతిపక్షాలు ప్రవర్తిస్తున్నాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. వారి విమర్శలను తిప్పికొట్టాలని ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణను బీజేపీ, కాంగ్రెస్‌లు వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఇక్కడ బీజేపీ పని అయిపోయిందని.. ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. కామారెడ్డి జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Harishrao Fires on Congress : ఈ క్రమంలోనే బీజేపీ నాయకులే పార్టీ మారేందుకు ఎదురుచూస్తున్నారంటూ హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలన మైగ్రేషన్ అయితే.. బీఆర్ఎస్ పాలన ఇరిగేషన్ అని స్పష్టం చేశారు. మళ్లీ ఆ పాలన వస్తే.. ఇప్పుడున్న పథకాలన్ని ఆగిపోతాయని ఆరోపించారు. కాంగ్రెస్ సహా గత ప్రభుత్వాల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు అంతకు ముందు ఎల్లారెడ్డిలో రూ.15 కోట్లతో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి భవనానికి హరీశ్‌రావు భూమి పూజ చేశారు.ఈ క్రమంలోనే గండిమాసానిపేట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
"రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రతిపక్షాలు ప్రవర్తిస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలకు తిప్పికొట్టాలని ప్రజలకు, కార్యకర్తలకు పిలుపునిస్తున్నాను. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు వెనక్కులాగేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయింది. ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు. మళ్లీ కాంగ్రెస్ పాలన వస్తే.. ఇప్పుడున్న పథకాలన్ని ఆగిపోతాయి." - హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి