కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామంలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. అక్కడే ఉన్న కొంత మంది రైతుల ధాన్యం గింజలు వరదలో కొట్టుకు పోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైందని అన్నదాతలు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
అకాల వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం - telangana varthalu
ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షానికి తడిసి ముద్దయింది. ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి కామారెడ్డి జిల్లా మాగి గ్రామంలో ధాన్యం వరదలో కొట్టుకుపోయింది.

అకాల వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం
అకాల వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యం