తెలంగాణ

telangana

ETV Bharat / state

కామారెడ్డిలో కురిసిన వర్షం.. తడిసి ముద్దయిన ధాన్యం - నీట తడిసిన ధాన్యం

కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి.. వాయుగుండంగా ఏర్పడటం వల్ల.. కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిస్తున్నాయి. రైతులు అమ్మడానికి కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం.. భారీ వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయింది.

Grain soaked in heavy rain In Kamareddy District
కామారెడ్డిలో కురిసిన వర్షం.. తడిసి ముద్దయిన ధాన్యం

By

Published : Oct 11, 2020, 9:46 AM IST

కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి రైతులు అమ్మకానికి తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటం వల్ల.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయి.. రైతులు నష్టపోయారు.

నీట తడిసిన ధాన్యం కుప్పలు
తడిసిన ధాన్యం
తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులు

జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలు ముందుగా వేయడం వల్ల.. తొందరగానే చేతికొచ్చాయి. అయితే.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరవకపోవడం వల్ల.. నిల్వ ఉంచిన ధాన్యం కుప్పలు వర్షానికి తడిసి రైతులు నష్టపోయారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని.. వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:ఎన్నికల రంగంలో పార్టీలు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు

ABOUT THE AUTHOR

...view details