తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ - kamareddy checks distribution news latest

సీఎం సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చెక్కులను పంపిణీ చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో సీఎం సహాయనిధి ద్వారా కోట్లాది రూపాయలు అందించామన్నారు.

Government whip distributing CM grant-in-aid checks
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

By

Published : Dec 29, 2020, 8:05 PM IST

కామారెడ్డి నియోజకవర్గంలోని 15 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 13 లక్షల 11 వేల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ఈ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించామన్నారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం సహాయనిధి ద్వారా కోట్లాది రూపాయలు అందించామన్నారు. గత రెండేళ్లలో ఇప్పటివరకు 522 మందికి రూ. 35 కోట్ల 43 నిధులు ప్రభుత్వం అందించిందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఆస్పత్రి పాలై ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఆస్పత్రి బిల్స్​తో తమ కార్యాలయంలో సంప్రదిస్తే.. సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించేలా కృషి చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:2020 రౌండప్:​ బండి జోరు.. భాజపా విజయాల హోరు

ABOUT THE AUTHOR

...view details