కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో బులియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్ణకార సంఘ సభ్యులు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. ఈ రోజు నుంచి 20 వరకు లాక్డౌన్ కొనసాగిస్తామని స్వర్ణకార సంఘ సభ్యులు తెలిపారు.
కరోనా ఎఫెక్ట్: బాన్సువాడలో స్వర్ణకార సంఘం స్వచ్ఛంద లాక్డౌన్ - kamareddy news
కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న వేళ కామారెడ్డి జిల్లా బాన్సువాడలో స్వర్ణకార సంఘ సభ్యులు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు నుంచి 20 తేదీ వరకు స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగించనున్నట్లు తెలిపారు.
goldsmith association announced self lock down in bansuwada
కరోనా వైరస్ పట్టణంలో శరవేగంగా వ్యాప్తిస్తున్న దృష్ట్యా... ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పారు. స్వచ్ఛంద లాక్డౌన్ ద్వారా వైరస్ నియంత్రణలో భాగస్వాములు అవుతామని స్వర్ణకార సంఘ సభ్యులు తెలిపారు.