కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో విషాదం చోటుచేసుకొంది. ఆత్మకూర్ గ్రామానికి చెందిన సానియా ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో తల్లి మందలించిందని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. ఎల్లారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సుమారు 95 శాతం గాయాలయినందున... వైద్యులు ఎల్లారెడ్డిలో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. తరలిస్తుండగా మార్గం మధ్యలోనే యువతి మరణించింది.
తల్లి మందలించిందని టీనేజ్ యువతి ఆత్మహత్య - కామారెడ్డిలో యువతి ఆత్మహత్యయత్నం
కామారెడ్డి జిల్లా ఆత్మకూర్ గ్రామంలో ఓ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి మందలించిందనే కోపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. 95 శాతం గాయాలైన యువతిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మరణించింది.
తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య..
Last Updated : Dec 26, 2019, 6:08 PM IST