కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని మహాత్మా జ్యోతిరావు పులే బీసీ గురుకుల పాఠశాల వసతిగృహాన్ని అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. శనివారం రోజున భవనం వద్దకు వచ్చిన యజమాని పరిసరాలు అపరిశుభ్రంగా ఉంచుతున్నారని ఆగ్రహం చెందాడు. విద్యార్థులు పెట్టెలు బయట పడేసి ఖాళీ చేసి వెళ్లిపొమ్మన్నాడు. ఏం చేయాలో పాలుపోక విద్యార్థులంతా తమ పెట్టెలతో బయట పడిగాపులు కాశారు. చివరకు పాఠశాల ప్రిన్సిపల్, చుట్టుపక్కల వాళ్లు సర్దిచెప్పడంతో యజమాని విద్యార్థులను లోపలికి అనుమతించాడు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తమకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఆయనకు ఆగ్రహమొచ్చింది... విద్యార్థులు రోడ్డున పడ్డారు! - గురుకుల పాఠశాల
గురుకుల పాఠశాల అద్దె వసతి గృహాన్ని విద్యార్థులు పాడు చేస్తున్నారంటూ యజమాని ఆగ్రహించి వారి పెట్టెలను బయటపడేశాడు. ఏం చేయాలో దిక్కు తోచని పిల్లలు వారి పెట్టెలతో చాలాసేపటివరకు బయట పడిగాపులు కాశారు.

వసతి గృహం నుంచి వెళ్లిపోండి...!