కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం తుంకిపల్లిలో గ్యాస్ ఇన్సూరెన్స్ పేరుతో కొంతమంది దళారులు ప్రజలను మోసం చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన 11మంది గ్యాస్ సిలిండర్ల లీకేజీలు, రెగ్యులేటర్లు రిపేర్ చేస్తామంటూ గ్రామానికి వచ్చారు. ఇదే సందర్భంలో గ్యాస్ సిలిండర్లు పేలి ప్రమాదం సంభవిస్తే ఇన్సూరెన్స్ వస్తుందంటూ ప్రజలను మభ్యపెట్టారు. ఇందుకోసం రూ.200 చెల్లిస్తే రూ.16లక్షల బీమా లభిస్తుందని నమ్మబలికారు. నిజమని నమ్మిన కొందరు గ్రామస్థులు రూ.200 చెల్లించారు. అయితే కొందరికి అనుమానం వచ్చి ఆరా తీయగా ఇదంతా మోసమని తేలింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వీరిని అరెస్టు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. వసూలు చేసిన డబ్బును దళారులు తిరిగివ్వడం గమనార్హం.
గ్యాస్ ఇన్సూరెన్స్ పేరుతో బురిడీ - Kamareddy district
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం తుంకిపల్లిలో రూ.200 చెల్లిస్తే రూ.16లక్షల గ్యాస్ ఇన్సూరెన్స్ వస్తుందని కొంతమంది ప్రజలను నమ్మించారు. ఇదంతా మోసమని తెలిసి కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వగా వారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
![గ్యాస్ ఇన్సూరెన్స్ పేరుతో బురిడీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3831013-529-3831013-1563033916858.jpg)
గ్యాస్ ఇన్సూరెన్స్ పేరుతో బురిడీ